ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కాన్వాయ్ పై ఓ మహిళ బ్లాక్ బెలూన్లు విసిరింది. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో బహిరంగ సభ ముగించుకొని తిరిగి వెళుతున్న సమయంలో తన కారులో వచ్చిన బిజెపి నాయకురాలు ఏకంగా పరుగులు తీస్తూ కేటీఆర్ కాన్వాయ్ పై బెలూన్ విసిరింది. కమాన్‌పూర్ మండలానికి చెందిన జనగామ సుజశ్రీ అనే బిజెపి మహిళా మోర్చా నాయకురాలు మంత్రి కేటీఆర్ పర్యటనను నిరసిస్తూ నల్ల బెలూన్లు విసిరినట్లు తెలుస్తుంది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులను అరెస్ట్ చేయడం పట్ల అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Admin
Aakanksha News