Monday, 10 August 2026 11:03:45 AM

భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు

Date : 06 April 2023 06:13 PM Views : 497

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : శ్రీ విఘ్నేశ్వర భక్తాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా గోదావరిఖని ఐబీ కాలనీలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో విశేష అభిషేకం, ఆకు పూజలతో పాటు ప్రత్యేక పూజలను ఆలయ కమిటీ చైర్మన్ టీచర్ శ్రీనివాస్ అధ్యక్షతన అర్చకులు పనకంటి భాస్కర శర్మ ఆధ్వర్యంలో భక్తాంజనేయ స్వాములతో కలిసి ఈ పూజలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో శ్రీరామ జయ రామ జయజయరామ నినాదాలతో మార్మోగింది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆంజనేయ స్వామి దీవెనలతో సంతోషంగా ఉండాలని కమిటీ చైర్మన్ తో పాటు అర్చకులు కోరారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి భక్తులు, మలదరణ ధరించిన స్వాముల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :