ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు, గూండాల దాడిని బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్.తీవ్రంగా ఖండించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయి.బిజెపి కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడిచేసేవరకు పోలీసులు మౌనపాత్ర, ప్రేక్షకపాత్ర వహించడం అన్యాయమని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్లు?కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ప్లాన్ ప్రకారం కర్రలు, రాడ్లతో బిజెపి స్టేట్ ఆఫీస్ గేట్ వరకు వచ్చి, పార్టీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడి చేస్తుంటే పోలీసులు నిలువరించకపోవడం వెనుక మతలబు ఏంటి అని ప్రశ్నించారు.ఈ దాడిలో ఒక దళిత కార్యకర్త నందు గారికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గారికి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ లకు గాయాలయ్యాయి.కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో విసిరి, రాడ్లతో దాడి చేసి దళిత కార్యకర్త నందు తలపగిలి రక్తం వచ్చేలా గాయపర్చారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలను ఉపేక్షించకూడదు.ఈ దాడి ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యత వహించాలణి డిమాండ్ చేసారు..ప్రభుత్వాలు ప్రజల రక్షణ కోసం పనిచేయాలి. కాని, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగమే ఇటువంటి దాడులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం?ఇప్పటికైనా దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కుమార్ డిమాండ్ చేసారు..కాంగ్రెస్ చేస్తున్న దాడులకు బిజెపి కార్యకర్తలు భయపడరని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లి, ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు.
Admin
Aakanksha News