ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నాగర్‌కర్నూల్ జిల్లా : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు పండుగ మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, తుమ్మల నాగేశ్వరరావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు దామోదర. రాజనర్సింహ,మంత్రి జూపల్లి కృష్ణారావు,అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హాజరైయ్యారు. అనంతరం రైతు పండుగ సదస్సులో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను సందర్శించి పంటలు మొదలైన అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాలలో రైతులకు వచ్చే అనుమానాలు, వ్యవసాయ పరంగా కలిగే ఇబ్బందులు, సలహాలు సూచన లను గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న వి ఏ ఓ లు పరిష్కరించాలని అన్నారు. అలాగే పూర్తి స్థాయిలో అవగాహన కలిగించాలని హాజరైన పార్టీ సీనియర్ నేతలు ప్రజా ప్రతినిధులకు తెలియజేశారు.
Admin
Aakanksha News