Thursday, 25 June 2026 07:45:24 PM

మోడీ కంటే ముందు ఈడీలు వస్తున్నాయ్..ఎమ్మెల్సీ కవిత

Date : 01 December 2022 11:42 AM Views : 590

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు రావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలోనే లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందటు మీడియాకు లీకులు ఇచ్చి తన పేరును ప్రస్తావించడాన్ని పట్టించుకోనని తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... వచ్చే సంవత్సరం డిసెంబర్ లో ఎన్నికలు ఉండటంతో మోడీ కంటే ముందు ఈడీ వస్తుందని ఆరోపించారు. తన మీద వచ్చిన ఆరోపణలకు ఎన్ని సంస్థలు వచ్చిన సమాధానం చెప్తామని అన్నారు.తనను మోడీ ప్రభుత్వం జైల్లో పెట్టలనుకుంటే పెట్టుకోవచ్చని అన్నారు.మీడియా కు లీకులు ఇచ్చి తన పేరును ప్రజల్లో చెడగొట్టలని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల పని చేస్తుంటే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. మోడీ చేస్తున్న బిజెపి వైఫల్యాలను ఎండగడతమని పేర్కొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :