ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైదరాబాద్ గడ్డపై తొలిసారి ప్రభుత్వ గుర్తింపు పొందిన స్థానిక జర్నలిస్టుల సంఘం ''హైదరాబాద్ యునియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూ జే. రి.నెం.B - 2794.) పేరును అనధికారికంగా ఉపయోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హెచ్ యూ జే ప్రతినిధి బృందం కార్మిక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. రిజిస్టర్డ్ హెచ్ యూజే సంఘం అధ్యక్షులు బి అరుణ్ కుమార్, కార్యదర్శి బి జగదీశ్వర్ నేతృత్వంలో ప్రతినిధి బృంధం శుక్రవారం కార్మిక శాఖ అదనపు కమిషనర్ డా.గంగాధర్, జాయింట్ కమిషనర్ సునీత గోపాల్ దాస్ తో సమావేశమయ్యారు. జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళుతూ వాటి పరిష్కారానికి హెచ్ యూ జే నిఖార్సుగా పనిచేస్తున్నదని చెప్పారు. తెలంగాణ యునియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీ యూ డబ్లూ జే) సంఘం తమ హైదరాబాద్ యూనిట్ కు అనధికారికంగా 'హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్ యూ జే ) పేరును ఉపయోగిస్తున్నారని వారికి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు అందజేశారు. ఇండియన్ ట్రేడ్ యునియన్ యాక్టు, 1926 ప్రకారం 2007వ సంవత్సరం జూన్ 27న కార్మిక శాఖలో హెచ్ యూ జే రిజిస్ట్రేషన్ జరిగిందని, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అనుబంధ సంఘంగా హెచ్ యూ జే కొనసాగుతోందని వారికి వివరించారు. అనధికారికంగా తమ సంఘం హెచ్ యూ జే పేరు వాడుతున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వారు కార్మిక శాఖ అదనపు కమిషనర్ డా.గంగాధర్ ను కోరారు. దీంతో ఆయన స్పందించి విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గంగాధర్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్ యూజే ట్రెజరర్ బి.రాజశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, నేషనల్ కౌన్సిల్ మెంబర్ సీహెచ్ మధుకర్, హెచ్ యూజే ఉపాధ్యక్షులు ఎం.రమేష్, జి. రేణయ్య, జాయింట్ సెక్రెటరీలు ఎం.జీవన్ రెడ్డి, అచ్చిన ప్రశాంత్, టీడబ్లూజేఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ విజయానంద్, నాయకులు హరి ప్రసాద్, రోజారాణి, పలువురు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు.
Admin
Aakanksha News