Friday, 25 September 2026 11:20:38 PM

గుర్తుంచుకునేలా కాదు... గుర్తుండేలా కార్యక్రమాలు చెయ్యాలి...

ఎన్ ఆర్ ఐ దంపతులు హేమలత అనిల్ ధావన్ ఔదార్యం...

Date : 14 November 2022 03:34 PM Views : 616

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పుట్టిన రోజు వేడుకలు ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా చేసిన సేవా కార్యక్రమాలు అందరిని ఆలోచింపచేస్తున్నాయి. పుట్టి పెరిగిన దేశాన్ని కూడా మర్చిపోకుండా తమ వంతు బాధ్యతయుతంగా ఇతరులకు సహాయ సహకారాలను అందించేందుకు ఇతర దేశాల నుండి సైతం తమ ప్రోత్సాహకాన్ని అనాధాశ్రమాలకు అందజేయడం ఎంతో అభినందనీయంగా ఉందని పలువురు వ్యక్తులు అభినందిస్తున్నారు.అమ్మ పరివార్ అనాధ ఆశ్రమంలో హేమలత అనిల్ ధావన్ దంపతుల తనయుడు ప్రముఖ జర్నలిస్టు, స్వచ్ఛంద సేవకులు దాట్ల జేమ్స్ రెడ్డి మేనల్లుడు హవీష్ పుట్టినరోజు వేడుకలను దాట్ల జేమ్స్ రెడ్డి అధ్యక్షతన అమ్మ పరివర్ ఆశ్రమంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి పిల్లలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమ నేత,మాజీ ఎంపీటీసీ, మాజీ పోలీస్ దళిత రత్న దేవి లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ హేమలత అనిల్ ధావన్ దంపతులు సేవా దృక్పథంతో గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. వృద్ధులకు అనాధలకు పేదవారికి సహాయం చేశారని ఈరోజు తన కుమారుని జన్మదినాన్ని కూడా ఒక సేవా కార్యక్రమంగా మలచడం అభినందనీయమని పేర్కొన్నారు. మొట్టమొదటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి కూడా ఈ రోజే కావడం యాదృచ్ఛికమైనప్పటికీ హవీష్ భగవంతుని ఆశీస్సులతో పెద్దల ఆశీస్సులతో గొప్ప పేరు తెచ్చుకోవాలని గొప్పగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా రిటైర్డ్ ఎస్సై సూర్యనారాయణ రెడ్డి బిజెపి నాయకులు రాములు వి.ఎన్ చారి మొగిలి ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజు విద్యార్థులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :