Friday, 07 August 2026 04:23:41 AM

నన్ను బెదిరించాలనుకుంటే చిక్కుల్లో పడతావ్...

ఆర్ ఎఫ్ సీ ఎల్ వ్యవహారం పక్కదారి...

Date : 23 January 2023 12:16 PM Views : 2384

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అందరిని బెదిరించినట్లు నన్ను బెదిరిస్తే చిక్కుల్లో పడతావ్ అంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు బిజెపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ హెచ్చరించారు.ఈ సందర్భంగా సోమవారం బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రామగుండం ఎరువుల కర్మాగారంలో జరిగిన ఉద్యోగాల దందాను పక్కదారి పట్టించేందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. అంతే కాకుండా నాపై విమర్శలు చేయడం మానుకొని నియోజక వర్గం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మరోసారి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాగే రామగుండంలో దుర్మార్గమైన పాలన నడుస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ప్రజలే ఎమ్మెల్యేను విశ్వసించడం లేదని పేర్కొన్నారు.అంతే కాకుండా నన్ను విమర్శించే ముందు నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. నేను మేధావి అని చెప్పుకోవడం కాదని నేనొక నిత్య విద్యార్థినీని అని అన్నారు. అనవసరంగా మాతో పెట్టుకోవద్దని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను హెచ్చరించారు. అలాగే ప్రజలే ఖబర్దార్ అనే రోజులు దగ్గరలొనే ఉన్నాయని అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :