ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : ప్రతి ఊర్లో పండ్ల చెట్లు నాటుదాం..పకృతిని ప్రజలను కాపాడుదాం..పకృతి ప్రసాదించిన పండ్ల చెట్లు ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఉండాలని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ పిలుపునిచ్చారు.. జనవరి నుండి డిసెంబర్ వరకు వివిధ కాలాల్లో వచ్చే ప్రతి పండ్ల చెట్టు ప్రతి ఊర్లో ఉండాలి ప్రతి పండు ప్రజలు తినాలి ప్రతి పండులో వివిధ రకాల పోషకాలు ఉంటాయి ప్రతి సీజన్లో వచ్చే ప్రతి పండు మనము తిన్నట్లయితే మన ఆరోగ్యము ఎంతో మెరుగుపడుతుందని అన్నారు. సీజన్ వారిగా వచ్చే వ్యాధులు మన దరి చేరవు కావున ప్రతి ఊర్లో పండ్ల చెట్లు పెట్టాలని రైతు సంక్షేమ సేవా సంఘం అహర్నిశలు కృషి చేస్తుందణి తెలిపారు. ఇటు ప్రజలకు పకృతికి ఎంతో మేలు జరుగుతుందని కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ పేర్కొన్నారు అదేవిధంగా అడవులలో కూడా మా సంఘం ద్వారా సీడ్ బాల్స్ తయారు చేసి అడవి సంపద పెద్ద నీకు కూడా మేము కృషి చేస్తున్నాము పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ అందరికీ పిలుపునిచ్చారు ఈ మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరిస్తూ సూచనలు కూడా ఇవ్వాలని ప్రతి ఒక్కరి బాధ్యతగా ముందుకు రావాలని వారు పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరి బాధ్యతగా ముందుకు రావాలని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ పిలుపునిచ్చారు
Admin
Aakanksha News