ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తుంది.అయితే కర్ణాటకలో ఓటమి నేపథ్యంలో బీజేపీ పార్టీ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఈటల రాజేందర్ పై ప్రత్యేక దృష్టి సారించిన అగ్రనేతలు దాదాపు పది గంటల పాటు సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు అసంతృప్తులకు ప్రాధాన్యంపై పార్టీ అగ్రనేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో నడ్డ, అమిత్ షాతో పాటు సంతోష్ జీ, సునిల్ బన్సల్, సావదాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అమిత్ షా రాష్ట్ర పర్యటనకు ముందే ఈ ప్రకటన విలువడే అవకాశం ఉందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. వివిధ పార్టీల్లోని అసంతృప్తులను బీజేపీలో చేర్చుకునే విషయంపై కూడా చర్చించారు. పొంగులేటితో మరోసారి భేటీకి ప్రయత్నించాలని నిర్ణయించారు. త్వరలోనే పార్టీ ముఖ్యలతో జాతీయ నేతలు సమావేశం జరపనున్నట్లు సమాచారం...
Admin
Aakanksha News