ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే... ర్యాగింగ్ కు కారణమని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం దగ్గర AISF పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల ప్రీతం ఆధ్వర్యంలో ర్యాగింగ్ భూతం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ప్రీతం మాట్లాడుతూ... ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వారానికి నాలుగు రోజులు కూడా హాజరుకాని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. కళాశాలలో పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరారు.
Admin
Aakanksha News