Friday, 25 September 2026 06:07:25 PM

సునీతా విలియమ్స్ యువతకు ఒక ప్రేరణ..

బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షురాలు ఏ. లత

Date : 20 March 2025 06:28 AM Views : 714

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : మహిళలు ఎందులో తీసి పోరణడానికి నిదర్శనం మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ అని బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షురాలు ఏ. లత అన్నారు.ఆకాశమే హద్దు" అని చెప్పడం సహజమే, కానీ దాన్ని నిజం చేసుకున్నవాళ్లు కొందరే! అలాంటి గొప్ప వ్యక్తుల్లో భారత సంతతి మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఒకరు కావడం యావత్ భారత దేశానికి గర్వకా రణమన్నారు. ఆమె జీవిత ప్రయాణం యువతకు కేవలం ఒక గాథ కాదు, అదొక ప్రేరణఅని . ఆమె మనోధైర్యం, క్రమశిక్షణ, పట్టుదల ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి స్ఫూర్తినిచ్చాయన్నారు. 195 రోజులు స్పేస్‌లో గడిపి, ఆ సమయంలో మహిళా వ్యోమగామిగా అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన ఘనత సాధించారన్నారు. సుమారు 50 గంటల 40 నిమిషాలు స్పేస్‌వాక్ చేసిన ఘనత సునీతా సొంతం. ఇది మహిళల విభాగంలో రికార్డు. ఐఎస్ఎస్ లో రన్నింగ్ ట్రెడ్‌మిల్ పై మారథాన్ పరుగు పూర్తి చేసిన తొలి వ్యక్తి గా రికార్డు సృష్టించారన్నారు .కష్టపడితే సాధ్యం కాదని, హెలికాప్టర్ పైలట్‌గా ప్రారంభమైన ఆమె ప్రయాణం, నాసా వ్యోమగామిగా మారడం వరకు – ఇది కృషి, పట్టుదల వల్లే సాధ్యమైందన్నారు. అమెరికా పౌరురాలిగా ఉన్నప్పటికీ, తాను భారతీయ మూలాల నుంచి వచ్చినదానినని గర్వంగా చెప్పడం ద్వారా ఆమె దేశభక్తిని వ్యక్తం చేశారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :