ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం మండల కార్యాలయంలో సర్వర్ డౌన్ లో ఉన్న సమస్య పరిష్కరించి త్వరితగతిన కులం, ఆదాయం, నివాస దృవీకరణ పత్రాలు జారీ చేయాలని కోరుతు రామగుండం తహశీల్దార్ జాహేద్ పాషకు రామగుండం మున్సిపల్ కార్పోరేటర్స్ ఫోరం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఫోరం నాయకులు మాట్లాడుతు..ముఖ్యమంత్రి కేసీఆర్ వెనుక బడిన కులాల వారికి చేయూతనందించాలనే మంచి ఆలోచనతో లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారని అన్నారు.ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కులం, ఆదాయం, నివాస దృవీకరణ పత్రాల కొరకు వేలాది మంది నిరుపేద వెనుక బడిన కులాల అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సర్వర్ డౌన్ తో ఈ పత్రాలు జారీ కావడం లేదని దీంతో మీ సేవా,ఎం ఆర్ ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే ఉన్నత విద్యాభ్యాసం కోసం కూడా వేల సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారని, కౌన్సిలింగ్ గడువు దాటిపోతున్నప్పటికీ రామగుండం మండలం నుండి కులం ఆదాయం, నివాస దృవీకరణ పత్రాలు జారీ కాక పోతే వారి విలువైన విద్యా సంవత్సరం వృధా అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సర్వర్ డౌన్ సమస్య పరిష్కరించడంతో పాటు అదనపు కంప్యూటర్ అపరేటర్ ల సేవలు ఉపయోగించుకొని పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని తహశీల్దార్ ను కోరారు. దీనికి తహశీల్దార్ సానుకూలంగా స్పందించారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలొ కార్పోరేటర్స్ ఫొరం అధ్యక్షులు కన్నూరి సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ధాతు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మేకల సదానందం, కార్యదర్శులు, నాయకులు ఐత శివకుమార్, గనుముక్కుల.తిరుపతి, నీల.గణేష్, వేగోళపు.శ్రీనివాస్ గౌడ్, మీర్జా సలీం బేగ్ లతొ పాటు ముఖ్యసలహదారు సాగంటి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News