Friday, 25 September 2026 10:41:28 PM

సింగరేణి యాజమాన్యం కేటాయించిన స్థలాన్ని విరమించుకోవాలి

Date : 19 March 2023 05:26 PM Views : 609

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : మేడిపల్లి గ్రామ శివారులో ఖబరిస్థాన్ ఏర్పాటును విరమించుకోవాలని మేడిపల్లి, మల్కపురం, జంగాలపల్లి, అన్నపూర్ణ కాలనీల ప్రజలు గ్రామస్థులు, రైతులు డిమాండ్ చేశారు. ఆదివారం మేడిపల్లి శివారులో వారు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల పట్ల తమకు వివక్ష లేదని, గ్రామాల ప్రజలు, రైతులు, ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తారని అన్నారు. అర్థరాత్రి పనులు నిమిత్తం సాగించే దృష్ట్యా, భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉన్నందున్న అందరి సౌకర్యార్థం మేడిపల్లి ప్రధాన రహదారి మేడిపల్లి శివారులో సింగరేణి యాజమాన్యం కేటాయించిన స్థలాన్ని కాకుండా వేరే ప్రాంతాన్ని కేటాయించాలని కోరారు. రహదారికి దగ్గరగా ముస్లిం, మైనార్టీల ఖబురస్థాన్ కోసం కేటాయించిన స్థలం మార్చాలని మేడిపల్లి, మల్కపురం, జంగాలపల్లి, అన్నపూర్ణ కాలనీల ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో చెప్యాల సత్యనారాయణ రావు, బండ లక్ష్మణ్ రావు, బండ రామారావు, మడ్డి రాజబాబు, పూసల శ్రీనివాస్, మడ్డి చంద్రయ్య, మడ్డి శ్రీనివాస్, మేకల మహేందర్, కొంతం అంజయ్య, ఆడెపు శంకర్, ముసిపట్ల కిరణ్, సింగం మల్లికార్జున్ గౌడ్, ముసిపట్ల రాజు, సింగం శంకర్ స్వామి, చింతల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :