Friday, 25 September 2026 04:57:56 PM

గోదావరిఖనిలో కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం

Date : 18 March 2023 08:23 PM Views : 720

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : TSPSC ప్రశ్న పత్రాలు లీకేజీలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు శనివారం గోదావరిఖని రాజేశ్ థియేటర్ సెంటర్ వద్ద NSUI జిల్లా కార్యదర్శి దాసరి విజయ్ కుమార్, ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. లీకేజీకి సంబంధించి నిందితులను వారి వెనుక ఉన్న సూత్రధారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో INTUC నాయకులు పోలు భాస్కర్, రామగుండం ఎస్సీ సెల్ అధ్యక్షులు తాళ్లపల్లి యుగేందర్, మాజీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలు రాజు, అజయ్, ఆనంద్, నగేష్, నరహరి, నరేందర్, సురేష్, భాస్కర్, పవన్, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :