ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై X వేదికగా బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో కొండ చిలువలు పాగా వేస్తే కళాశాలలో కట్లపాములు కాటయ్యవా అంటూ ఎద్దేవ చేశారు. మాకు పిల్లల ప్రాణాలు రక్షించడం చేతకాకపోతే కేవలం మాకు అక్రమ కేసులు పెట్టడం మాత్రమే వచ్చు మహాప్రభో అని ఒప్పుకోవాలని X వేదికగా ఆయన ఘాటుగా విమర్శించారు.గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పాము కాట్లపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. దీనిపై అసెంబ్లీలో మంత్రి సీతక్క సలహాలు ఇవ్వొచ్చని కాబట్టి తాను కొన్ని సూచనలు చేస్తున్నానని వెల్లడించారు.ప్రతి రోజూ ఒక మంత్రి పెద్దాపూర్ గురుకులంలో పిల్లల డార్మిటరీలో పడుకోవాలని అది కూడా ప్రిన్సిపల్ రూంలో కాకుండా సచివాలయాన్ని పెద్దాపూర్ గురుకులంకు తరలించవచ్చని సలహా ఇచ్చారు.ప్రతి సంక్షేమ గురుకుల పాఠశాలకు ఒక స్నేక్ క్యాచర్ పోస్టును కేటాయించి వారిని టీజీపీయస్సీ ద్వారా రిక్రూట్ చేసుకోవచ్చని అన్నారు.ఆ పరీక్షలో ప్రశ్నలు మాత్రం తెలంగాణ పాముల గురించే అడగాలని గ్రూప్-2లో లాగా పక్క రాష్ట్రాల పాముల గురించి కాదని ఎద్దేవా చేశారు.పెద్దాపూర్ గురుకులాన్ని విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి మార్చి ఇప్పుడున్న గురుకులాన్ని సరీసృప నీలయంగా మార్చవచ్చని విమర్శించారు.ఏది కాకపోతే మీరందరూ సామూహిక రాజీనామా చేయవచ్చని సలహా ఇచ్చారు.మా చావు మేము చస్తాం. లేకపోతే.. మీ ఇళ్లలోకి పాములు రావు కాని మా పిల్లల బడుల్లోకి ఎట్ల వచ్చి మళ్లీ మళ్లీ కాటేస్తున్నాయి??. పుస్తకాలలో పాఠాలు నేర్చుకోవాలా? పాములు పట్టడం నేర్చుకోవాలా? కాంగీ దయ్యాలు?.. అంటూ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ చేశారు. X వేదికగా చేసిన ఈ ఆరోపణలు రాజకీయ వర్గంలో సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
Admin
Aakanksha News