Monday, 10 August 2026 11:03:43 AM

అసమర్థుల చేతిలో రామగుండం పరిపాలన

కాంగ్రెస్ పార్టీ నాయకుల ధ్వజం

Date : 04 August 2023 01:39 PM Views : 737

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అసమర్థుల చేతిలో రామగుండం పరిపాలన కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి,గట్ల రమేష్ లు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ..గత నెల రోజుల నుండి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న పరిణామాల దృశ్య అనేక సార్లు పరిపాలన విభాగంకు కానీ ఇతర అధికారుల కానీ విన్నమించిన ఏటువంటి స్పందన లేదని వారన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పాలన గురించి ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుందని అనడం వారి అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు.అభివృద్ధి ఓర్వలేకనే విమర్శిస్తున్నారని చెప్పడం వారికే చెల్లుతుందని అన్నారు.బీఆర్ఎస్ పార్టీకి చెందిన 5గురు నాయకులు మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ,టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి,పాలకుర్తి జెడ్పిటిసి కందుల సంధ్యారాణి, బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ పర్మినెంట్ కార్మిక సంఘం నాయకులు మనోహర్ రెడ్డి,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాతిపల్లి ఎల్లయ్యలు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అవినీతిపరుడు,భూములను, ఉద్యోగాలు అమ్ముకున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారని అన్నారు. సుమారుగా 50 కోట్ల రూపాయల వరకు ఆర్ఎఫ్ సీఎల్ ఉద్యోగ దందాలో చేతులు మారాయని, ఏంతో మంది ఆత్మహత్యలకు కారణమయ్యారని విమర్శించారు. ఇది అంత నిజమేన కాదా అనేది స్థానిక శాసనసభ్యులు చెప్పాలని డిమాండ్ చేశారు.కేటీఆర్ ను కలిసి గోదావరి ప్రాంతం బ్యాక్ వాటర్ కరాకట్టా నిర్మాణం గురించి స్పష్టమైన హామీతో రావాలని తెలిపారు. ఐటీ పార్కులను తేవడం, ఇండస్ట్రియల్ స్మాల్ ఇండస్ట్రియల్ ఉపాధి కల్పించాలని, కొత్త బావులు తవ్వించాలని, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కావాలని చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పించాలని మర్చిపోయి చీటికిమాటికి చిల్లర రాజకీయాల కోసం ప్రెస్ మీట్ పెట్టడం చీటికీ మాటికి కేటీఆర్ ను కలవడం సెల్ఫీలు తీయడం కేసీఆర్ ని గల సెల్ఫీలు దిగడమే ఎమ్మెల్యే పని అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విలేకరుల సమావేశంలో చుక్కల శ్రీనివాస్, గౌతమ్, సతీష్, తాళ్లపల్లి యుగంధర్, హరిప్రసాద్, సతీష్, కిరణ్ గౌడ్, కారంగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :