Tuesday, 11 August 2026 09:08:52 PM

ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దగ్ధం

Date : 19 November 2022 10:18 PM Views : 668

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కరీంనగర్ జిల్లా : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఇంటిపై TRS గుండాల దాడికి, అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మెట్ పల్లి స్థానిక వ్యవసాయ మార్కెట్ ముందు మున్నూరు కాపు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి mlc కవిత దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదా మున్ముందు కార్యాచరణ సిద్ధం చేసి మున్నూరు కాపు ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. కవితకు కుల అహంకారం ఎక్కువయ్యి మున్నూరు కాపుల ఎదుగుదలని జీర్ణించుకోలేక పోతుందని అందుకే కేసీఆర్ తో కలిసి మున్నూరు కాపు బిడ్డలు అయిన ఎంపీ అరవింద్ అలాగే బండి సంజయ్, ఎంపీ ప్రజా గొంతిక తీన్మార్ మల్లన్న పై తరచు దాడులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. మున్నూరు కాపులు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు ఆకుల శ్రీనివాస్ పుప్పాల నాగేష్ రమేష్ భాస్కర్ మహేష్ లింగారెడ్డి నరేష్ రాజేందర్ లక్ష్మణ్ శంకర్ జలపతి మల్లేష్ కిరణ్ రమేష్ శ్రీకాంత్ అజయ్ నరేష్ లు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :