ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : బండి సంజయ్ రాములవారి మీద ఒట్టు వేస్తావా.. రాజ్యాంగం మీద ఒట్టు వేస్తావా చెప్పాలని టిపిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేసారు.సోమవారం గాంధి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ బండి సంజయ్ దురుద్దేశంతో చేస్తున్న అనుచిత వాఖ్యలు, అబద్ధాలు ప్రజలను మోసం చేసేవి లాగా ఉన్నాయన్నారు..కేంద్రం నుంచి నిధులు వస్తె.. రాష్ట్రం పేర్లు పెట్టడం లేదని మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని సంక్షేమాలకు నిధులు ఇచ్చారు. ఎంత ఇచ్చారు?? అందులో మీ వాటా ఎంత??కేంద్రం నుంచి తెలంగాణ లో పిఎం అవాస్ యోజన (గ్రామీణ) కింద ఇండ్లకు ఎన్ని నిధులు తెచ్చావో భద్రాచలం రాముడి గుడికి తడి బట్టలతో వచ్చి చెప్పు.పదేళ్లలో తెలంగాణ పల్లెల్లో నిర్మించిన ఒక్క డబుల్ బెడ్ రూమ్ లోని ఒక ఇటుక కు కూడా కేంద్రం నిధులు ఇవ్వలేదు.హనుమండ్ల గుడి లేని ఊరు లేదు.. ఇందిరమ్మ ఇళ్లు లేని వాడ లేదు.రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి బీసీలకు 5 లక్షలు,ఎస్సీ,ఎస్టీ లకు 6 లక్షలు ఇస్తే..రాష్ట్ర కేంద్ర పథకం సహాయం తీసుకుంటే పల్లెల్లో ఇండ్ల నిర్మాణానికి పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ) కింద 72వేలు.. పట్టణాల్లో లక్షన్నర వస్తుంది..అందులో కేంద్రం నిధులు ఇస్తే వచ్చేది 10-15శాతం మాత్రమే.కేంద్రం నుంచి ఆ నిధులు వస్తే మరింత మందికి ఇండ్లు ఇవ్వవచ్చనే ఆలోచన మా ప్రభుత్వానిది.పేదలందరికీ ఇండ్లు నిర్మించండి మీ పేరే పెట్టుకోండి. పేరు కోసం రాష్ట్ర ప్రభుత్వం పాకులాడటం లేదు. ప్రజా ప్రభుత్వానికి పేదలకు ఇండ్లు కట్టించడమే ధ్యేయం.కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాలు అందించడమే ధ్యేయంగా కేంద్ర మంత్రులను సీఎం కలుస్తున్నారు.తెలంగాణ లో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.రాష్ట్ర విభజన తర్వాత 54లక్షల66వేల రేషన్ కార్డులకు మాత్రమే 5కిలోల బియ్యం కేంద్రం ఇస్తుంది. ఈ కార్డులలోని కుటుంబ సభ్యులందరికీ కూడా రాష్ట్రం 1కిలో బియ్యం అదనంగా సొంత ఖజానా నుండి ఇస్తుంది.35లక్షల రేషన్ కార్డులకు.. రాష్ట్ర ఖజానా నుంచి ప్రతీ మనిషికి 6కిలోల బియ్యం రాష్ట్రం ఇస్తుంది.ఐదు కిలోల బియ్యం కూడా ఎగ్గొట్టాలని చూశారు.పేదల కడుపు నింపే విధానం బీజేపీది కాదు.కార్పొరేట్ కడుపు నింపే ఆలోచన చేస్తుంది.ప్రజలే ఆలోచించాలి ఎవరి పేరు పెట్టాలి అనేది.తెలంగాణ కు రావాల్సిన ఐటీఐఆర్ కోసం పోరాటం చేయండి బండి సంజయ్.పదేళ్లలో ఒక్క కేంద్రం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.గద్దర్ చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులకు ఆయన పోరాటాన్ని పొగుడుతూ మోదీ లేఖ రాశాడు.తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి బండి సంజయ్.తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెబుతారు
Admin
Aakanksha News