ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మంచిర్యాల జిల్లా : సీసీసీ నస్పూర్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ముందస్తుగా పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్స్ గురించి పోలీస్ వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 9వ తేదీన సీసీసీ నస్పూర్ లో నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్న కారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య కలగకూడదని ఉదయం నుండి ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేయడం జరుగుతోంది కావున ప్రజలందరూ సహకరించగలరని పోలీసులు విజ్ఞప్తి చేశారు.గోదావరిఖని, చెన్నూరు వైపు నుండి మంచిర్యాల వైపు వచ్చే వాహనదారులు శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ వద్ద ఉన్న నేషనల్ హైవే ఫ్లైఓవర్ మీదుగా క్యాతనపల్లి గాంధారి వనం నుండి మంచిర్యాల వైపు వెళ్లాలని,మంచిర్యాల వైపు నుండి శ్రీరాంపూర్, చెన్నూరు మరియు గోదావరిఖని వైపు వెళ్లే వాహనదారులు మంచిర్యాల్ ఐబి చౌరస్తా నుండి క్యాతన పల్లి గాంధారి వనం వద్ద గల నేషనల్ హైవే ఫ్లైఓవర్ మీదుగా శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ వద్ద నుండి వెళ్లాలని మంచిర్యాల పోలీసులు ఒక్క ప్రకటనలో తెలిపారు.
Admin
Aakanksha News