Saturday, 18 January 2025 09:58:38 AM

అంగరంగ వైభవంగా రుద్రపాల్ కుమ్మరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ....

Date : 07 January 2025 08:59 PM Views : 113

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : దమ్మాయిగూడ రుద్రపాల్ కుమ్మరి సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సంఘ పెద్దల ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ల సమక్షంలో వైభవోపీతంగా సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దమ్మయిగూడ కౌన్సిలర్లు రామరం శ్రీహరి గౌడ్ వసుపతి రమేష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఉపాధ్యక్షులు ఆర్ వీరేశం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు చంద్రయ్య మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ శ్రీనివాస్, బాలానగర్ బోయిన్పల్లి కోశాధికారి అశోక్, నేటితరం దినపత్రిక చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్లు సంఘ పెద్దలు ముఖ్య అతిథులుగా విచ్చేసి క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రామారం శ్రీహరి గౌడ్ వసుపతి రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రపాల కుమ్మరి సంక్షేమ సంఘం, మేడ్చల్ జిల్లాలోనే కుమ్మరి సంఘానికి ఆదర్శంగా, పనిచేస్తూ సంఘ సభ్యుల సంక్షేమం కోసం పాటుపడుతున్న సంఘమని వారు సంఘానికి చేస్తున్న సేవలను కొనియాడారు, సంఘ సభ్యులంతా ఐక్యంగా ఉండి సంఘంలోని సభ్యులందరికీ, బంగారం పంచడం అభినందనీయమన్నారు, సంఘ సంక్షేమానికి పాటుపడుతున్న సంఘం అధ్యక్షులు లక్ష్మణ్, లింగం రమేష్ లను సంఘ సభ్యులను వారు అభినందించారు, కుమ్మరి సంఘo స్థల సేకరణకు భవన నిర్మాణానికి తలవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరేశం జిల్లా అధ్యక్షులు చంద్రయ్యలు మాట్లాడుతూ. కుమ్మరి సంఘ సభ్యులంతా ఐక్యంగా ఉంటేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయని సంఘ సభ్యులంతా ఒకే సంఘం కింద పని చేస్తే ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు రాష్ట్ర కమిటీ అందించే పలు పథకాలు కూడా సంఘ సభ్యులకు అందుతాయని వారు పేర్కొన్నారు, సంఘ సంక్షేమం కోసం పాటుపడుతున్న సంఘ సభ్యులను ఈ సందర్భంగా వారు అభినందించారు. సంఘ సంక్షేమం కోసం రాష్ట్రవ్యాప్తంగా కుమ్మరి సంఘo ఒకే గొడుగు కింద తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని వారు పేర్కొన్నారు. సంక్షేమ సంఘానికి శ్రీశైలంలో అన్న సత్రం కూడా ఏర్పాటు చేశామని ప్రతి దైవ క్షేత్రంలో కూడా మన కుమ్మరి సంఘ సత్రాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రపాల ధమ్మాయిగూడ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పి కృష్ణమూర్తి ఎం నర్సింగ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ పి సాయి బాబా డీజే దేవేందర్ బి జయమ్మ జాయింట్ సెక్రెటరీ ఎం ప్రవీణ్, ఆర్ అజయ్, పి నరేష్ తో పాటు పెద్ద ఎత్తున సంక్షేమ సభ్యులు కుమ్మరి సంఘం అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

<