ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సిద్దిపేట జిల్లా : మంచిగా చదువుకొని విద్యార్థులు తమ తల్లి దండ్రుల గౌరవాన్ని కాపాడాలని మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈ సందర్బంగా సిద్ధిపేట మండలంలోని తడకపల్లి బీసీ హాస్టల్లో విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు.విద్యార్థులతో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు.గత 6 నెలల నుండి విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు రాకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. అలాగే అసెంబ్లీ లో చెప్పిన మెనూ వేరే ఉంది హాస్టల్ లో వేరే ఉందన్నారు. విద్యార్థులు ధరించే దుస్తులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు.విద్యార్థులు డ్రగ్స్, అన్ లైన్ గేమ్స్ బారిన పడకుండా ఉండాలని విద్యార్థులకు సూచించారు.
Admin
Aakanksha News