Tuesday, 11 August 2026 05:47:39 PM

రామగుండంలో 2018 ఎన్నికల సిన్ రిపీట్

హోరా హోరీగా కొనసాగనున్న ఎన్నికల యుద్ధం..

Date : 30 November 2023 07:39 PM Views : 1075

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరిగా కొనసాగాయి. కాంగ్రెస్, బిజెపితో పాటు స్వతంత్ర అభ్యర్థి మధ్య అసెంబ్లీ ఎన్నికల యుద్ధం కొనసాగినట్లు తెలుస్తుంది. అయితే ఈసారి ఎన్నికల్లోను 2018 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల సీన్ రిపీట్ అయినట్లు తెలుస్తుంది. 2018 వ సంవత్సరంలో (AIFB) ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి కోరుకంటి చందర్ పోటీ చేయగా, తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) నుండి సోమరపు సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, బిజెపి పార్టీ నుండి బల్మూరి వనిత, బీఎస్పీ పార్టీ నుండి మెరుపు శంకర్, ఎస్ఎఫ్ బీ నుండి ముత్యాల వెంకటేష్ పోటీ చేశారు. వీరిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి పోటీ చేసిన కోరుకంటి చందర్ కు 61.400 ఓట్లు పోల్ కాగా సోమారపు సత్యనారాయణకు 34981, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కు 27181, బిజెపి పార్టీ అభ్యర్థి బల్మూరి వనితకు 1553, ఎస్ఎఫ్ బి పార్టీ నుండి పోటీ చేసిన ముత్యాల వెంకటేష్ కు 3531, బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేసిన మెరుగు శంకరకు 1797 ఓట్లు పోలయ్యాయి. అయితే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సోమరపు సత్యనారాయణపై 26419 ఓట్ల మెజారిటీతో కోరుకంటి చందర్ గెలుపొందారు. అప్పుడు 2018లో సోమరపు సత్యనారాయణకు, కోరుకంటి చందర్ కు పచ్చగడ్డి వేస్తే బగ్గు మనే అంత విభేదాలు పార్టీలో చోటు చేసుకోవడంతో టిఆర్ఎస్ పార్టీ నుండి కనీస సభ్యత్వం కూడా కోరుకంటి చందరకు కల్పించకపోవడంతో (AIFB) ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి పోటీ చేశారు. అయితే గతంలో ఇద్దరు ఒకే పార్టీలో ఉండటం,చివరి నిమిషంలో కోరుకంటికి సానుభూతి రావడంతో ఎక్కువగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్లు ఎక్కువగా పడడంతో టిఆర్ఎస్ పార్టీకి నష్టం జరగడంతో కోరుకంటి చందర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గతంలో జరిగిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే ప్రస్తుత రాజకీయాలు కూడా అలాగే కొనసాగినట్లు తెలుస్తుంది. గత ఎన్నికల సమయంలో సోమవారం సత్యనారాయణ, కోరుకంటి చందర్ మధ్య ఉన్న రాజకీయ వివాదంలో కోరుకంటి చందర్ కు ఏ విధంగా అయితే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్లు సానుకూలంగా వచ్చాయో అలాగే బిజెపి పార్టీ అభ్యర్థి కందుల సంధ్యారాణికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇద్దరు ఒకే పార్టీలో ఉన్న కోరుకంటి చందర్ తో ఉన్న విభేదాల నేపథ్యంలో పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి బిజెపి పార్టీ నుండి పోటీ చేసిన కందుల సంధ్యారాణికి ఈ ఎన్నికల ఓట్లు అనుకూలంగా మారినట్లు సమాచారం. దీంతో పాటు ప్రస్తుతం కోరుకంటి చందర్ పై రామగుండం నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు రావడంతో పాటు రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల కుంభకోణం ప్రభావం ఎక్కువగా పడటంతో ఈసారి అధికార పార్టీకి పడాల్సిన ఓట్లు ఎక్కువగా సంధ్యారాణికి పోలైనట్లు తెలుస్తుంది. దీంతో పాటు గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేయడం, ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గంలోని మహిళల్లో సానుభూతి ఉండడం సంధ్యారానికి కొంతమేరకు సానుకూల పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తుంది. అయితే గత ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో 71.94 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో 66.83 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు మహిళల ఓట్లు సమానంగా ఉండడం కొంత మేరకు సంధ్యారాణికి అనుకూలంగా కలిసొచ్చే అవకాశాలు ఉన్నట్లు పలు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :