Saturday, 18 January 2025 09:14:38 AM

పరిపాలకులు సహాయం కోరితే లంచాలు తీసుకుంటున్నారు...

మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ

Date : 14 August 2023 01:57 PM Views : 574

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : పరిపాలకులు సహాయం కోరితే అనుచరులు లంచాలు తీసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం బొగ్గు భాయి బాట కార్యక్రమంలో భాగంగా అర్జీ-1 ఏరియాలోని GDK-2A, ఇంక్లైన్ కు వెళ్లి కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ఎఫ్ సీ ఐ లో ఇంజనీర్ గా పనిచేస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేసి మొదటిసారిగా రాజకీయాలలోకి వచ్చినప్పుడు సింగరేణి కార్మికులే నన్ను ఆదరించి మున్సిపల్ చైర్మన్ గా గెలిపించారని అన్నారు. సింగరేణి కార్మికులకు రుణపడి ఉంటానని తెలిపారు. మన సింగరేణి కార్మికులు నివాసం ఉండే ఏరియాలలో వర్షాకాలంలో మురుగునీరు ఇళ్లలోకి రాకుండా ఫెరో సిమెంట్ దొండ్ల ద్వారా కాలువలు కట్టించానని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం చేపించానని పేర్కొన్నారు. అదే విధంగా లీట్టర్ ఫ్రీ జోన్ అనే కార్యక్రమంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్త, బకెట్లు సప్లై చేయడం జరిగిందని అన్నారు. ట్రై సైకిల్స్ ద్వారా మున్సిపల్ కార్మికులు వచ్చి వాటిని సేకరించి వాటిని ఒక ఖాళీ ప్రదేశంలో డంపు చేయడం జరిగేదని కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇప్పించిన ఘనత తనదేనని పేర్కొన్నారు. సింగరేణి పరిసర ప్రాంతాలలో వాటర్ ట్యాంకులు కట్టించి త్రాగునీరు సౌకర్యం కల్పించానని, మున్సిపాలిటీలో లంచాలు అనేవి లేకుండా బర్త్ సర్టిఫికెట్ కానీ, డెత్ సర్టిఫికెట్ కానీ, ఆదాయం సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్, ఇల్లు కట్టించడానికి పర్మిషన్ కొరకై ఇంకా ఎన్నో సదుపాయాల గురించి మున్సిపాలిటీలో ఒక కంప్లైంట్ బుక్కు ఏర్పాటు చేసి అలాగే ఒక టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు, కార్మికులకు తొందరగా పనులు జరిగేలా పరిపాలన సాగించానని, ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు, సింగరేణి కార్మికుల పిల్లలకు ఉచితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించానని, కానీ ఇప్పుడున్న పరిపాలకులు ఏదైనా సహకారం కొరితే వారి దగ్గర లంచాలు తీసుకుంటున్నారని, భూకబ్జాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది నాయకులు సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దయచేసి వారి మాటలను ఎవరు నమ్మకూడదని కార్మికులకు పిలుపునిచ్చారు.ప్రధానమంత్రి మోడీ ఎట్టి పరిస్థితులలో సింగరేణినీ ప్రైవేట్ పరం చేయబోనని కాబట్టి సింగరేణి కార్మికులు ఎట్టి పరిస్థితిలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారి మాటలు నమ్మవద్దని తెలియజేశారు.అదేవిధంగా సింగరేణి కార్మికులకు ఇంకమ్ టాక్స్ విషయంలో చాలా అన్యాయం జరుగుతుందని వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మొలుగూరి వీరన్న, పిడుగు కృష్ణ,దీటి వెంకటస్వామి మంచి కట్ల బిక్షపతి, సోమారపు అరుణ్ కుమార్,సంజీవ్, జనగామ రాయలింగు,కోదాటి ప్రవీణ్, డేవిడ్ రాజు, రాజ్ కుమార్, సురేందర్, అనురాగ్,నిఖిల్, వాసు,బిజెపి నాయకులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు