ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా రామగుండం నియెజక వర్గంలో పాలకుర్తి జడ్పిటిసి కందుల సంధ్యారాణి తన ప్రచారాన్నీ ముమ్మరం చేశారు.అన్ని డివిజన్లలో మహిళలతో సమావేశం ఎర్పాటు చేసుకుంటూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మహిళా అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. ఆదివారం 39 వ డివిజన్ లో పర్యటించారు.ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో రామగుండం నుండి పొటీలో ఉంటున్నానని మీరంతా అండగా ఉండాలని కోరారు.ఒక మహిళగా తనకి అవకాసం కల్పిస్తే మహిళల అభివృద్ది కోసం కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో వారితో పాటుగా ఈదునురీ పద్మ,కథం నవలత , జుమ్మిడి తార, లత, సుగుణ,పద్మ ,లావణ్య,ఒదమ్మ,లక్ష్మి,పోచమ్మ ,శిరీష, సౌంజన్య, శ్రావణి,వనజ,ప్రమీల, స్వరూప,మధునమ్మ, సుజన,లహరి,రాయ పోచమ్మ,దుర్గమ్మ తదితరులు పాల్గోన్నారు.
Admin
Aakanksha News