ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / మంథని : మంథని పురపాలక సంఘం పరిదిలోని తెలంగాణ మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను డివిజనల్ పంచాయతీ అధికారి కే.సతీష్ కుమార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, భోజనతీరు ను పరిశీలించి విద్యార్థులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహార పదార్థాలను అందజేయాలని పాఠశాల ప్రిన్సిపాల్ ను కోరారు. పాఠశాల స్టోర్ గదిలో నిల్వ ఉంచిన బియ్యాన్ని ఆహార నిల్వలను పరిశీలించి, ఎప్పటికప్పుడు పురుగు నివారణకు వేపాకును ఉపయోగించాలన్నారు. విద్యార్థులకు అందించే భోజన ఆహార పదార్థాలను వంట చేయుటకు ముందు నిరంతరం పరిశీలించాలన్నారు. సీజనల్ వ్యాదుల బారిన పడకుండా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాఠశాల పరిసరాలలో, విద్యార్థుల గదులలో విద్యుత్తు లైట్లు సక్రమంగా పనిచేసే విధంగా పర్యవేక్షించాలని కోరారు. అలాగే మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వే డాటా ఎంట్రీ జరుగుతున్న పనితీరును పరిశీలించి ఎలాంటి తప్పులు తావులేకుండా సర్వే వివరాలను రోజుకు 50 కుటుంబాల వివరములను కచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయాలని డాటా ఎంట్రీ ఆపరేటర్కు ఆదేశించారు.
Admin
Aakanksha News