Thursday, 24 September 2026 04:14:29 PM

నిత్యాన్నదాన పథకానికి భక్తుల విరాళాలు...

Date : 03 December 2024 08:01 PM Views : 501

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని రంగాపూర్ గ్రామ పరిధిలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర దేవాలయ క్షేత్ర అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం నిత్యాన్నదాన పథకాన్ని ఆలయ పాలక మండలి సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా నిత్యాన్నదానానికి వనపర్తికి చెందిన విజయలక్ష్మి 25 వేల రూపాయలు ఉప్పు నుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామనికి చెందిన మిద్దె లక్ష్మి వెయ్యి పదహారు రూపాయలను విరాళంగా అందించారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి పాలక మండలి, ఆలయ సిబ్బంది శాలువాతో సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ బీరం మాధవరెడ్డి, దేవస్థాన కమిటీ డైరెక్టర్ పవన్, ఈఓ శ్రీనివాస్ రావు, ఆలయ సిబ్బంది అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :