Monday, 22 June 2026 11:53:38 PM

మద్దతు ధర ఇవ్వకుండా పసుపు రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ...

తెలంగాణ శాస‌న‌మండ‌లి వ‌ద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న

Date : 15 March 2025 05:32 PM Views : 527

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : ప‌సుపు రైతుల‌కు రూ.15వేల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని ఎమ్మెల్సీ క‌విత ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ శాస‌న‌మండ‌లి వ‌ద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ప‌సుపు రైతులు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నార‌ని వారికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌న్న అంశంపై కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వం కానీ ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. తెలంగాణ‌లోని ప‌సుపు రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో పేర్కొన్న‌ విధంగా పసుపు రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా ప‌సుపు రైతులని మోసం చేసిన‌ట్లు క‌విత ఆరోపించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :