Thursday, 24 September 2026 03:33:34 PM

రోడ్డెక్కిన చదువుల పంచాయతీ...

వివాదాస్పదంగా మారుతున్న రావుస్ పాఠశాల తీరు... చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు

Date : 26 April 2023 10:27 PM Views : 2417

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఉన్నత విద్యను అందించి... ఎంతోమంది విద్యార్థులను భావి తరాలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దే పాఠశాల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. ఓవైపు పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసానికి గురి చేయడంతో పాటు ఫీజుల పేరిట అందిన తాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే...పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరి కాలనీలోని రావుస్ పాఠశాల తీరు వివాదాస్పదంగా మారుతుంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదంలో ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అయితే గతంలో ఎన్టీపీసీలో ఉన్న పాఠశాల సంవత్సరం కిందట సప్తగిరి కాలనీకి మారింది. ఈ క్రమంలో ఎటువంటి షిఫ్టింగ్ అనుమతులు లేకుండానే సంవత్సరం కాలంగా పాఠశాలను నిర్వహించారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనిపై గతంలో సైతం పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ముందు ఆందోళనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో జరిగిన సీబీఎస్ సీ పరీక్షలను సిద్దిపేట జిల్లా నుండి తీసుకవచ్చి ఎన్టీపీసీలో రాయించినట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అయితే సదురు కార్పొరేట్ పాఠశాల బిల్డింగ్ కిరాయి కట్టడం లేదని సంబంధిత ఓనర్ కోట కుమార్ పాఠశాల గెట్ కు తాళం వేయడంతో సదురు పాఠశాల యాజమాన్యం తాళం పగలకొట్టి యధావిధిగా పాఠశాలను నడిపించారు. 8 నెలలుగా కిరాయి ఇవ్వడం లేదని అడిగితే పాఠశాల మహిళా సిబ్బందితో వేధింపులకు గురి చేస్తున్నారని పాఠశాల యాజమాన్యంతో పాటు పలువురు సిబ్బందిపై కోట కుమార్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై పాఠశాల యాజమాన్యం సైతం బిల్డింగ్ యజమాని కోట కుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఒకరికొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకొని రోడ్డెక్కడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా తయారయింది. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఇప్పటికైనా జిల్లా విద్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :