ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నిజామాబాద్ జిల్లా : పసుపు బోర్డు విషయంలో ఎంపీకి బాధ్యతారహితంగా మాట్లాడటం అలవాటే అని,రాజకీయాల్లో అయన ఎప్పుడు వెలికి మాటలే మాట్లాడతారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఎంపీకి చురకలంటించారు. ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... బిజెపి పార్టీ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కానీ బిజెపి పార్టీ ఇతర పార్టీ నాయకులను పిలవకుండా తమ పార్టీ సొంత కార్యక్రమంలా పసుపు బోర్డును ఏర్పాటు చేయడం సరైంది కాదని అన్నారు. అలాగే పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపుకు 15 వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేసారు. పసుపు బోర్డు విషయంలో గతంలో బండ్ పేపర్ రాసి ఇచ్చిన ఎంపీ అనేక విషయాలలో ప్రజలను తప్పుదోవ పాంటించే విధంగా మాట్లాడారని అన్నారు. రాజకీయాల్లో ఏది మాట్లాడిన ప్రజలు గుర్తు పెట్టుకుంటారని గతంలో ఇచ్చిన హామీలను ఎంపీ గుర్తు చేసుకోవాలని అన్నారు.
Admin
Aakanksha News