Monday, 10 August 2026 01:51:04 PM

రాజేందర్ జీవితం జర్నలిజానికే అంకితం

35 సంవత్సరాల జర్నలిస్టు జీవితం ఆదర్శప్రాయం..

Date : 02 November 2022 03:23 PM Views : 722

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : తొలినాళ్ళలో జర్నలిజం విలువలను పాటిస్తూ... నాటి జర్నలిజానికి స్ఫూర్తి దాయకంగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన పిట్టల రాజేందర్ ఇక లేరు అనే వార్త అందరినీ కలచి వేస్తోంది. ఉపాధ్యాయుడిగా ఉంటూనే ఎంతో మంది విద్యార్థులను, ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్ది జర్నలిజం వృత్తికే తన జీవితాన్ని అంకితం చేసిన నేటితరం జర్నలిస్టులకు తాను స్ఫూర్తిగా నిలిచారు. ఎంతో మందికి జర్నలిజంలో శిక్షణ, మెళుకువలు నేర్పించిన పిట్టల రాజేందర్ జీవితం పుస్తకం లాంటిది.ఎంత చదివినా, నేర్చుకున్న ఇంకా తెలుసుకోవాలి అనిపించే రాజేందర్ జీవితంలో ఎన్నో అనుభవాలను ప్రతి ఒక్కరితో పంచుకునే స్వభావం కలిగిన రాజేందర్ నేడు ఎంతో మంది యువ జర్నలిస్టులు తనను ఆదర్శంగా తీసుకున్నారు. వీణవంక గ్రామానికి చెందిన పిట్టల రాజేందర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి, శ్రీ రామ విద్యాలయం లో కరస్పాండెంట్ గా విధులు నిర్వహించారు.సుమారుగా 1982 నుండి జర్నలిజంలో ఉన్న పిట్టల రాజేందర్ నేటి వరకు అదే జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు.. అయితే గత కొన్ని రోజులుగా తన ఆరోగ్యం సరిగ్గా లేక పోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఈ విషాదకర ఘటనతో గోదావరిఖని ప్రెస్ క్లబ్ సభ్యులు తోటి జర్నలిస్టులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మృతి చెందడం పట్ల పారిశ్రామిక ప్రాంతంలో విషాదాచాలు అలుముకున్నాయి. పిట్టల రాజేందర్ మృతి ఎంతోమంది జర్నలిస్టులకు తీరని లోటుగా మిగిలింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :