ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆసక్తికర ట్వీట్(ఎక్స్) చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి తనకు చాలామంది రకరకాల ఫీడ్‌బ్యాక్‌లు, పరిశీలనలు పంపుతున్నారని తెలిపారు. అలా తనకు అందిన ఫీడ్‌బ్యాక్స్‌లో బెస్ట్ అనిపించిన ఒక దాన్ని నెటిజన్లతో ట్విట్టర్ వేదికగా ఆయన పంచుకున్నారు.కేసీఆర్ 32 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసే బదులు.. ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టాల్సింది అని తనకు వచ్చిన ఒక అబ్జర్వేషన్‌ను నెటిజన్లతో కేటీఆర్ షేర్ చేసుకున్నారు. దీనితో తాను కూడా ఏకీభవిస్తున్నానని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Admin
Aakanksha News