Sunday, 22 March 2026 02:13:09 AM

ఎమ్మెల్యేగా పద్మరావు గౌడ్ ప్రమాణము

Date : 14 December 2023 06:26 PM Views : 310

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మరావు గౌడ్ గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఎం ఎల్ ఏ గా ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఆయనతో ప్రమాణం చేయించారు. 2014 నుంచి వరుసగా మూడో సారి ఎం ఎల్ ఏ గా ఎన్నికై సికింద్రాబాద్ లో హ్యాట్రిక్ సాధించిన పద్మారావు గౌడ్ తొలుత 2004 లో ఎం ఎల్ ఏ గా ఎన్నికయ్యారు. అప్పటి ఎన్నికల్లో ఆయనను 3067 ఓట్ల మెజారిటీ లభించింది. తెలంగాణ కోసం రాజీనామా చేసిన అయన ఆ ఉప ఎన్నికల్లో విజయం సాధించలేదు.అనంతరం 2014, 2018, 2023ల్లో వరుసగా ఎం ఎల్ ఏ గా ఎన్నికయ్యారు. ప్రతి ఎన్నికల్లో ఆయన సాధించిన మెజారిటీ పెరుగుతూ తాజాగా 45,240 ఓట్ల ఆధిక్యతను సాధించి సికింద్రాబాద్ లో హ్యాట్రిక్ తో ఎం ఎల్ ఏ రికార్డు ను నెలకొల్పారు.ఈ సందర్బంగా అయన ను నియోజకవర్గం లో పలువురు అభినందనలు తెలిపారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :