ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ కాలయాపన చేస్తుందని ఆటో కార్మికుల జెఏస్సి నాయకులూ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను చేయాలనీ డిమాండ్ చేస్తూ ఆటో జేఎస్సి ఆధ్వర్యంలో నవంబర్ 05 వ తేదీన చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చారు. ఈ మహా ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను జెఏస్సి నాయకులు ఆహ్వానించారు. అనంతరం మహా ధర్నా పోస్టర్ ను కేటీఆర్ ఆవిష్కరించారు.
Admin
Aakanksha News