Monday, 10 August 2026 06:00:23 PM

వర్చువల్ మీటింగ్ ద్వారా పి.ఎం ప్రారంభోత్సవ కార్యక్రమాలని వీక్షించిన కందుల సంధ్యారాణి..

Date : 12 March 2024 05:07 PM Views : 627

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఇటీవలే వికసిత్ భారత్ లో భాగంగా పలు రైల్వేస్టేషన్ల పునరుద్దరణ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టారు. ఈపునరుద్దరించిన 500 రైల్వే ప్రాజెక్టులని నేడు మహరాష్ట్ర నుండి పి.ఎం నరేంద్ర మోడి ప్రారంభించారు. ఇట్టి రైల్వే స్టేషన్స్ ప్రారంబోత్సవ కార్యక్రమాలని రామగుండం రైల్వే స్టేషన్ లో రైల్వే అధికారులు లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా,ఈ కార్యక్రమానికి బిజేపి నాయకురాలు కందుల సంధ్యారాణి హజరై, లైవ్ ద్వారా ప్రధానమంత్రి మోడీ ప్రారంభోత్సవ కార్యక్రమాలని వీక్షించారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు కందుల సంధ్యారాణిని శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజినల్ కమర్షయల్ మేనేజర్ బస్వరాజు,డివిజినల్ రైల్వే మేనేజర్ శ్రీ బ్రతేష్ కుమార్,చీఫ్ కమర్షయల్ ఇన్స్ పెక్టర్ సంతోష్ కుమార్,బుకింగ్ స్టాఫ్ వాణి,ఆల్ డివిజినల్ ఆఫీసర్స్,కార్పొరేటర్ కన్నూరి సతీష్, బిజేపి నాయకులు గాండ్ల దర్మపురి,సతీష్,తోట కుమార స్వామి,పైతరి రాజు,సురేష్,వినయ్, చిలువేరు కుమార్,సైదులు,పిడుగు విజయ్, పవన్ సింగ్,క్రాంతి తదితరులు పాల్గోన్నారు...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :