Friday, 11 July 2025 04:54:49 AM

కందుల మద్దతు ధర 7550 రూపాయలతో ప్రభుత్వం కొనుగోలు...

మంత్రి పొన్నం ప్రభాకర్

Date : 18 January 2025 07:09 AM Views : 270

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సిద్దిపేట జిల్లా : కందుల మద్దతు ధర 7550 రూపాయలతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రైతులు కందులను మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. గతంలో వడ్లు, పత్తి, సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించామన్నారు. సిద్దిపేట జిల్లాలో నాఫెడ్ టిజి మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడారు. సిద్దిపేట మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభ చేసుకున్నామని, వడ్ల కొనుగోలు చేసిన 48 గంటలలో రైతులు నగదు చెల్లించామని, సన్న వడ్ల కు 500 బోనస్ ఇచ్చామని, జనవరి 26 నుండి వ్యవసాయ యోగ్యమైన భూములు రైతు భరోసా ఇస్తున్నామని, రైతు భరోసా 12 వేలకు పెంచామని స్పష్టం చేశారు.భూమిలేని ఉపాధి కూలీలకు 12 వేలు ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందని, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందని, నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తున్నామని, గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవని, కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. పేర్ల మార్పిడి చేసుకోవాలనుకునే వారు చేసుకోవచ్చని, రైతు భరోసా కింద గతంలో ఉన్న దానిని 12 వేలకు పెంచామని పేర్కొన్నారు. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని, రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. త్వరలోనే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ పర్యటించి అయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీవో సదానందం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటయ్య, ఇతర అధికారులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2025. All right Reserved.

Developed By :