Saturday, 26 September 2026 11:34:43 PM

క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట...

ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి

Date : 10 March 2025 09:10 PM Views : 421

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : పబ్లిక్ సర్వెంట్స్ ప్రీమియర్ లీగ్-2025" క్రికెట్ టోర్నమెంట్ ను ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) మరియు ఢిల్లీలో తెలంగాణా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా తెలంగాణా ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ మరియు జి.ఎస్.టీ డిపార్ట్ మెంట్ మధ్య ప్రారంభ మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించి,క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.ఈ సందర్బంగా శ్రీ ఏపీ. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గ్రామస్థాయి నుండి ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీయడం జరుగుతుందన్నారు. క్రీడల అభివృద్ది కొరకు అధిక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. గత ఏడాది కాలంలోనే క్రీడల్లో విప్లవాత్మకమైన మార్పులు సాధించిన తెలంగాణ రాష్ట్రం రానున్న రోజుల్లో మరింత క్రీడాభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తుందని ఆయనఅన్నారు. ఈ కార్యక్రమంలో జిఎస్టి కమిషనర్ శ్రీమతి ధనలక్ష్మి, ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ డీజీకే పావని, డాక్టర్ హరికృష్ణ డాక్టర్ మీరా, టోర్నమెంట్ ఆర్గనైజర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :