Wednesday, 23 September 2026 11:21:33 AM

ఎంజీఎం హాస్పిటల్ లో పాము ప్రత్యక్షం

Date : 14 October 2022 01:46 PM Views : 480

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వరంగల్ జిల్లా : వరంగల్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ లో పాములు కలకలం సృష్టిస్తున్నాయి. పేషంట్లను,అటెండర్లను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.శుక్రవారం హాస్పిటల్ లోని ఫీవర్ వార్డులో పాము కలకలం రేపింది. దీంతో పేషెంట్లు పేషంట్ అటెండర్స్ భయభ్రాంతులకు గురయ్యారు. చివరికి పాములు పట్టే వ్యక్తి వచ్చి పామును పట్టుకొని వెళ్లడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. వరుసగా ఇటీవల ఎంజీఎం ప్రాంతంలో పాములు సంచరించడం అందరిని భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాముల బారిన పేషంట్ గాని హాస్పిటల్ కి వచ్చే ప్రజలు గాని ఇబ్బంది పడకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :