ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సూర్యాపేట జిల్లా : పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పించి వారికి న్యాయం చేయాల్సిన ఓ ఖాకీ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే... ఓ క్రిమినల్ కేసు విషయంలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేయకుండా ఉండేందుకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్.ఐ వి.సురేష్, కానిస్టేబుల్ నాగరాజు లు 3 లక్షలు డిమాండ్ చేయగా మొదటి విడతగా 1లక్ష 40 వేల రూపాయలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. క్రిమినల్ కేసులో సెక్షన్ 35 BNS చట్టం ప్రకారం నోటీసులు జారీ చేయడానికి 3 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.
Admin
Aakanksha News