Friday, 25 September 2026 06:38:18 PM

ఎప్పుడైనా ఎక్కడైనా నేను పోటీకి సిద్ధం

ఇంటిపై దాడులు చేసే అధికారం ఎవరిచ్చారు...

Date : 18 November 2022 02:21 PM Views : 524

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నిజామాబాద్ జిల్లా : ఎప్పుడైనా ఎక్కడైనా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ ఎమ్మెల్సీ కవితను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నా ఇంటిపైదాడులు చేసే అధికారం ఎవరిచ్చారని 70 సంవత్సరాల నా తల్లిపై ఏలా దాడులు చేస్తారని ఆయన ప్రశ్నించారు. నాతో పోటీ చేయడానికి ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నారా మళ్ళీ మాట మార్చుతారా అంటూ ప్రశ్నించారు. కుటుంబ సభ్యులపై దాడులు చేసి ఎవరిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఒకే వర్గానికి చెందిన వ్యవస్థ నడుస్తుందని, ఈ కేసులకు ఎవరు భయపడే లేదని అన్నారు. ఈ ఘటనపై అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వారి నిర్ణయం మేరకే నడుచుకుంటామన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :