ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : మనం నిత్యం వివిధ రకాల శారీరక, మానసిక ఆరోగ్య వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తులను, వారి ఆలనా పాలనలో సతమత మవుతున్న తల్లిదండ్రులను చూస్తుంటాం. అటువంటి పిల్లలను చేరదీసి , వారు తమ కాళ్లపై తాము నిలబడి, ఆర్థికంగా స్వశక్తితో నిలదొక్కుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను, శిక్షణను అందించుటకు ఏర్పడిన స్వచ్ఛంద సంస్థయే ''మిట్టి కేఫ్'' మానసిక శారీరక ఆరోగ్య వైకల్యం కలిగిన వారి పట్ల సమాజం దృష్టికి తెచ్చి, స్పందింప జేయుటకు ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్, సుప్రీం కోర్టు కాంప్లెక్స్, పలు అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 40 కి పైగా స్థలాలలో లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకురాలు స్వర్ణభ మిత్ర వివరించారు. ఈ Cafe లలో ప్రత్యేకంగా నెలకొల్పిన స్టాల్ నందు చే ఆధునిక శైలిలో చేతితో రూపొందించిన గృహ, కార్యాలయ అలంకరణ పరికరాలు, పిల్లల ఆట వస్తువులు, నోటు పుస్తకాలు, పెన్నులు విక్రయిస్తున్నారు. సామాజిక దృక్పథంతో ఏర్పాటు చేస్తున్న ఆలోచనను గుర్తించి, వాటి నిర్వహణకు CSR కింద పలు ప్రభుత్వ రంగ , ప్రయివేట్ కార్పోరేట్ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కేఫ్ లను పలువురు సెలబ్రిటీస్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. బొల్లారం లోని రాష్ట్రపతి నిలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన రిసెప్షన్ సెంటర్ భవనంలో రాష్ట్రపతి నిలయం అధికారులు ఉచితంగా కేటాయించిన స్థలంలో ను నెలకొల్పారు. 15 మంది మానసిక శారీరక ఆరోగ్య వైకల్యం కలిగిన వ్యక్తులు ఈ కేఫ్ ను స్వయంగా నడుపుతున్నారు. వీరికి నెలకు (వారు చేసే విధులను బట్టి) 15 వేల నుండి 50 వేల రూపాయల వరకు వేతనంగా అందుతుంది. ఆర్థిక స్వావలంబన, ఆత్మ గౌరవం తో జీవించుటకు , కుటుంబాన్ని నడుపుటకు మిట్టి కేఫ్ అండగా ఉంటున్నట్లు నిర్వాహకురాలు స్వాతి జి తెలిపారు. మిట్టి కేఫ్ నందు సమోసా, చాట్, పకోడీ, మసాలా టీ, బిస్కట్లు, కాఫీ, మాగి, శాండ్ విచ్, పలు రకాల ఐస్క్రీమ్స్, ఇతర చిరుతిండ్లు స్వయంగా నాణ్యతతో రుచికరంగా తయారు చేసి , విక్రయిస్తున్నారు. రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించటానికి వచ్చే పర్యాటకులు తమ షెడ్యుల్ లో మిట్టి కేఫ్ ను కూడా చేర్చుకోవాలి. రాష్ట్రపతి నిలయం ఆవరణలో నెలకొల్పిన మిట్టి కేఫ్ కు అవసరమైన పెట్టుబడి, రెగ్యులర్ గా నడుపుటకు అయ్యే నిర్వహణ ఖర్చులను కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తో పాటు ఆస్ట్రేలియా -న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూప్ లు భరిస్తున్నాయి. ఈ cafe ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని చొరవ తీసుకున్నది. వార్షికముగా రూ. 36-46 లక్షలు టర్నోవర్ సాధిస్తామని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
Admin
Aakanksha News