Friday, 07 August 2026 04:23:42 AM

బెల్ట్ షాప్ ల ప్రభావం.. మద్యం మత్తులో ప్రమాదం..

నడుచుకుంటూ వెళ్తున్న మహిళను డీ కొట్టిన యువకులు...

Date : 10 May 2023 07:40 AM Views : 786

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : బెల్ట్ షాప్ ల ప్రభావంతో.. మద్యం మత్తులో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తెల్లవారుజామున పాలకంటే ముందు పెగ్గు దొరకడంతో ఈ ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... గోదావరిఖని మేదర్ బస్తీకి చెందిన ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో తమ ద్విచక్ర వాహనం టీఎస్ 19సీ 1277 అనే పల్సర్ 220 వాహనంపై బస్టాండ్ నుండి జిఎం కాలనీ వైపు వెళ్తుండగా సాయిబాబా ఆలయం వద్ద నడుచుకుంటూ వెళుతున్న బాపూజీ నగర్ కు చెందిన ఓ మహిళను మద్యం మత్తులో ఢీకొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే సదరు యువకులు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలోనే చిత్తుగా మద్యం సేవించి ఉన్నారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు ఉండగా ఇద్దరు పరారీ కాగా ఒకరిని స్థానికులు పట్టుకొని 100కు సమాచారం అందించారు. ఇంత జరుగుతున్న బెల్ట్ షాపులను నియంత్రించాల్సిన పోలీసులు, అధికారుల తీరుపై ఎన్నో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆదాయాన్ని నష్టపరుస్తూ నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలం చెందరనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :