Sunday, 27 September 2026 12:20:49 AM

టాటా నగర్ లో ప్లాస్టిక్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం..భారీగా ఆస్తి నష్టం

Date : 07 February 2024 05:06 PM Views : 465

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కాటేదాన్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టాటా నగర్ లోని ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో చెలరేగిన మంటల తో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది ఈ సంఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టాటా నగర్ లో ఉన్న ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించి మంటలు పక్కనే ఉన్న మరో ఫ్యాక్టరీకి అంటుకోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలాన్ని సందర్శించిన మైలార్దేవ్పల్లి పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రప్పించి మంటలు అర్పి వేయించారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో బాబుల్ రెడ్డి నగర్ పరిసర ప్రాంతం లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోయినప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ మేరకు మైలార్ దేవ్ పల్లి సీఐ మధు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :