ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : పంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్యం పై సమాజంలో అవగాహన పెంచడం అత్యవసరమని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ (EPDC) పేర్కొంది . సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణ, ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కోసం ప్రతి సినిమా హాల్‌లో, టీవీ కార్యక్రమాల్లో నిర్బంధ ప్రకటనలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ‘కౌన్సిల్’ డిమాండ్ చేసింది.EPDC వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య బుధవారం హైదరాబాద్ బాగ్ లింగం పల్లిలో విలేకరులతో మాట్లాడుతూ.. సినిమా థియేటర్లు & టీవీ ఛానళ్లు సామాన్య ప్రజానికానికి అత్యంత ప్రభావవంతమైన కమ్యూనికేషన్ మాధ్యమాలని, రోజూ కోట్లాది మంది టీవీ చూస్తారు, లక్షలాది మంది సినిమా హాళ్లకు వెళతారు. ఈ నేపథ్యంలో సింగిల్-యూజ్ ప్లాస్టిక్ ప్రభావాల గురించి అవగాహన కల్పించే సందేశాలు థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు & మధ్య విరామ సమయంలో, అలాగే టీవీ షోల మధ్య ప్రభుత్వ ప్రకటనల రూపంలో వస్తే ప్రజలకు భారీ స్థాయిలో సమాచారం అందుతుందని పేర్కొన్నారు. ఈ చర్య వల్ల ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది – ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి కలిగే ముప్పు గురించి ప్రజలకు స్పష్టమైన అవగాహన కలుగుతుందన్నారు. అంతేగాక ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే అవకాశ, ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల కలిగే ముప్పును అర్థం చేసుకున్న ప్రజలు దాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. అందుకు ప్రభుత్వ నిబంధనలు సహాయపడతాయన్నారు, ఇప్పటికే కొన్ని ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం ఉన్నా అవగాహన లోపం వల్ల అమలు సాధ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ, సినిమా ప్రకటనల ద్వారా ప్లాస్టిక్ పై అవగాహన ను బలోపేతం చేయవచ్చని రంగయ్య పేర్కొన్నారు. అయా మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరికీ అవగాహన కల్పించేందుకు ఉత్తమ మార్గమన్నారు. ఈ డిమాండ్‌ను మరింత బలపరచడానికి EPDC ప్రధానమంత్రి, కేంద్ర పర్యావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రం సమర్పించడంతో పాటు, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించిందని, “ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ వ్యర్థాలపై చర్చ జరగాలి – ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి” అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.ప్రపంచ వ్యాప్తంగా సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. భారతదేశంలో కూడా ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా దీన్ని తగ్గించే మార్గం ఏర్పడుతుంది. EPDC ప్రతిపాదించిన విధంగా సినిమా థియేటర్లలో & టీవీ ప్రకటనల రూపంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన కార్యక్రమాలు అమలు చేయడం సాధ్యమైతే, అది భారతదేశ పర్యావరణ పరిరక్షణలో ఓ పెద్ద మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
Admin
Aakanksha News