ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన కాంతాల గణేష్ రెడ్డి (22)లు అనే యువకుడు శుక్రవారం కరెంట్ షాక్ తో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... చంద్రబాబు నాయుడు కాలనీలో చికెన్ షాప్ నిర్వహిస్తున్న యువకుడు మంచినీటి పంపు వస్తూ ఉండటంతో షాపు ను శుభ్రం చేసి మోటార్ ను బంద్ చేస్తు ఉండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగలడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో యువకుడి కుటుంబ సభ్యులు రోదిస్తూన్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
Admin
Aakanksha News