Tuesday, 22 September 2026 10:19:07 AM

మందిని తిడితే ఎమ్మెల్యే కావు.......⁉️

గతంలో జరిగిన బడిత పూజ మర్చిపోయావా...⁉️

Date : 11 July 2023 12:59 PM Views : 1662

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : మందిని తిడితే ఎమ్మెల్యే ఎప్పటికి కాలేవని రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు తోడేటి శంకర్ గౌడ్, మారుతి లు ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. అసలు తనను కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చూడనేలేదని ఎద్దేవ చేశారు. ఎక్కడి నుండో రామగుండంకు వచ్చి స్థానిక ఎమ్మెల్యేను తిడితే పేరు వస్తుందని అనుకోవడం తమ అవివేకానికి నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలను పట్టించుకున్న పాపను పోలేదని పేర్కొన్నారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం ఎంత మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారో... ఎం అభివృద్ధి చేసారో... తెలంగాణ ప్రభుత్వంలో ఎంత మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చామో ఎంత అభివృద్ధి జరిగిందో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని వారు సవాల్ విసిరారు. ఎన్నికలు జరిగినప్పుడే రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మక్కాన్ సింగ్ కు గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో కనిపించకుండా పోయి ఎన్నికలు వస్తున్నాయని ప్రత్యక్షమై స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బడిత పూజ చేస్తామని మాట్లాడడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన బడిత పూజ మరిచిపోయావా అంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే బూడిద, ఇసుక, మట్టి దందా చేస్తున్నట్లు నిరూపిస్తారా అని ప్రశ్నించారు. అసలు ఎన్టీపీసీలో బూడిద కాంట్రాక్టు ఎవరిదో తెలుసా అని ప్రశ్నించారు. మక్కన్ సింగ్ కు జ్ఞానం పరిజ్ఞానం ఉంటే మట్టి,ఇసుక, బుడిద దందా కాంట్రాక్టు ఎవరివో తెలుసుకోవాలని హితువు పలికారు. నీ అనుచరులే రామగుండం ఎరువుల కర్మగారం ఉద్యోగాల కుంభకోణంలో డబ్బులు తీసుకున్నారని దమ్ముంటే వారికి డబ్బులు ఇప్పి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంచి పనులు చేస్తే చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వారన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఇప్పటివరకు చేసిన అభివృద్ధిపై ప్రజలకు వివరిస్తూ వారికి జవాబు దారిగా ఉంటామని వారు తెలిపారు. అంతేకానీ ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తరిమికొట్టే రోజులు వస్తాయని వారు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో అచ్చే వేణు, నూతి తిరుపతి గుంపుల ఓదెలు, ఏం ఏ హమీద్, నగేష్, గోవర్ధన శాస్త్రి, రాజిరెడ్డి, వాసు, అనుముల మునీందర్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :