ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కార్మిక సమస్యల మీద కొట్లాడాల్చిన ఓ కార్మిక సంఘం నేత ఉద్యోగాల పేరుతో వసూళ్ల దందాకు తెరలేపాడు. తన తోటి కార్మిక సంఘం నేత వద్దనే ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి కార్మికులకు నీతి వాక్యాలు వల్లించడం పట్ల పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే... కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటు ఓ కార్మిక సంఘం నేత,అతని కుమారుడు,మోసం చేయటంతో బాదితులు అతని ఇంటి ముందు ఆందోళనకు దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీయుసి నాయకుడు ధర్మపురి, అతని కుమారుడు దిలీప్ తనకు కోర్టులో జడ్జిలు తెలుసు అని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 21 మంది వద్ద సుమారు 52 లక్షల రూపాయలు వసూళ్ళు చేశారు. మంథని వెంకన్న అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉండి తమ బందువులు వద్ద డబ్బులు ఇప్పించాడు. ఏడాదిగా డబ్బులు ఇవ్వకుండా తండ్రి, కొడుకులు, తప్పించుకుంటూ తిరుగుతున్నారు.దీంతో బాదితుడు వెంకన్న,అతని తల్లి మణెమ్మ ధర్మపురి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు వచ్చి బాదితులను పోలీస్ స్టేషన్ కు తీసుక వెళ్లారు.తాము ఎన్ని సార్లు అడిగిన డబ్బులు ఇవ్వటం లేదని బాదితులు ఆరోపించారు. సదరు కార్మిక సంఘం నాయకుడి పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Admin
Aakanksha News