ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతాన్నిటూరిజం హబ్ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది పర్యాటకులకు అహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే తన లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత ఆగస్టు నెలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులను నల్లమల్ల ప్రాంతానికి ఆహ్వానించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు ప్రసిద్ధ ప్రముఖ దేవాలయాలను కొండ గుహలను పర్యాటక ప్రదేశాలను సందర్శించడం జరిగిందని అన్నారు. ఈ పర్యటన నేపథ్యంలో నల్లమల ప్రాంతాన్ని అందరినీ ఆశ్చర్య పరిచే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు స్పందించి ముఖ్యమంత్రి సూచనతో నల్లమల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని ఆయన తెలిపారు.నల్లమల ప్రాంతం ఊటీ లాంటిది ఇక్కడ పర్యాటక ప్రాంతంగా మారిస్తే ఎంతో మంది ప్రయాణికులు ఈ ప్రాంతాలను పర్యాటకుల సందర్శన కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో విజయడైరీ, అచ్చంపేట చైర్మన్ దొడ్ల నరసయ్య, యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కట్టా అనంతరెడ్డి,మాజీ ఎంపీపీ రామనాథం, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Aakanksha News