Saturday, 26 September 2026 07:23:50 AM

ఏసీబీ వలలో ఇద్దరు అవినీతి అధికారులు…!

45 వేలు లంచం తీలుకుంటు ఉండగా పట్టుకున్న అధికారులు...

Date : 24 January 2024 08:21 AM Views : 598

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా : ఏసీబీ అధికారులు చాకచక్యంగా ఇద్దరు అవినీతి అధికారులను లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం నర్కూడలో పరిధిలోని అమ్మపల్లి గ్రామం దగ్గర తనకు చెందిన స్థలంలో మధు అనే వ్యక్తి ఇల్లు కట్టుకోవాలని మున్సిపల్ లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంటి అనుమతుల కోసం నర్కూడ గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నరసింహ, బిల్ కలెక్టర్ నాగరాజులను అధికారులను సంప్రదించగా అనుమతులు ఇచ్చేందుకు రూ. 65వేలు ఇవ్వాలని మధును డిమాండ్ చేయడంతో నేను అంత డబ్బు ఇవ్వలేనని అధికారులను మధు ఎంత బ్రతిమిలాడిన కనికరం చూపించలేదు. చివరకు రూ.45 వేలకు ఒప్పందం కుదరడంతో అక్కడి నుండి వెళ్లిపోయిన మధు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో డబ్బులు ఎక్కడ ఇవ్వాలని బిల్ కలెక్టర్ నాగరాజును కోరడంతో గ్రామపంచాయతీ వద్దకు వచ్చి డబ్బులు చెల్లించాలని బిల్ కలెక్టర్ చెప్పడంతో మధు అక్కడకు చేరుకున్నారు. కానీ అంత కంటే ముందే ఏసీబీ అధికారులు గ్రామ పంచాయతీ వద్ద మాటు వేశారు.బాధితుడు మధు నుంచి బిల్ కలెక్టర్ నాగరాజు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో పాటు సెక్రటరీ లక్ష్మీ నరసింహను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.వారిని నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :