ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : ఇథనాల్ కంపెనీలో ఏర్పాటులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సంతకాలతో ఉన్న వివరాలను అతి త్వరలో బయటపెడుతామని మంత్రి సీతక్క తెలిపారు. దిలావర్‌పూర్ లో ఏర్పాటు చేస్తున్న ఇథనాల కంపెనీలో బిఆర్‌ఎస్ నేత డైరెక్టర్‌గా ఉన్నారని తెలియజేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వియ్యంకుడు సుధాకర్‌కు ఈ కంపెనీలో భాగస్వామ్యం ఉందన్నారు. మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. గతంలో బిఆర్ఎస్ నాయకులు తప్పు చేసి ఇప్పుడు రెచ్చగొట్టి ఇప్పుడు విధ్వంసాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.కంపెనీల ఏర్పాటు విషయంలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నామని, గ్రామ సభల్లో ప్రజలు అంగీకరిస్తారని బిఆర్ఎస్ నాయకులు తమ కార్యకర్తలతో రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. తప్పును వందసార్లు ప్రచారం చేస్తే సరి అవుతుందని చూస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే కెటిఆర్ దిలావర్‌పూర్ రావాలని, తాను కూడా వస్తానని సవాల్ విసిరారు. కంపెనీకి అనుమతులు ఎవరు ఇచ్చారనేది అతి త్వరలో తేలుస్తామన్నారు.
Admin
Aakanksha News